header

Margasira Masam

మార్గశిరమాసం

margasira masam మార్గశిరమాసం మార్గానాం మార్గశీర్షోహం అర్జునా మాసాలలో మార్గశిరాన్ని నేను అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రకటించుకొన్నాడు. మార్గశిరంలో వ్రతాలకు, పూజలకూ కొదవలేదు. చంద్రుడు ఈ మాసానికి అధిపతి. ధనుర్మాసం సూర్యుడు వృశ్ఛికరాశి నుండి ధనూరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే ధనుస్సంక్రమణం అంటారు. సూర్యడు మరలా మకరరాశిలోకి ప్రవేశించేదాకా ఉన్న 30 రోజులూ పరమ పవిత్రం. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం. గోదాదేవిది మధురభక్తి. తండ్రి విష్ణుచిత్తుడు శ్రీరంగనాధునికి పూజకోసం సిద్ధం చేసిన మాలలను మెడలో వేసుకొని మురిసిపోయేది. ఆ సంగతి తండ్రికి తెలిసింది. మందలించాడు ఐనా వినలేదు. గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని చేపట్టింది. రోజుకో పాశురంతో నారాయణుకి పారాయణ జరిపింది. భక్తవత్సలుడు బాసికం కట్టుకొని మరీ భువికి దిగివస్తాడు. గోదాదేవిని తనదాన్ని చేసుకొని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఇదంతా జరిగింది ఈ మాసంలోనే మార్గశిర విశేషాలు :
మార్గశిరమాసంలో ప్రతిరోజూ పవిత్రమైనదే. శుక్లపక్ష పాడ్యమి రోజు నదీస్నానం శ్రేష్టమని అంటారు. తదియనాడు మామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. అలా మార్గశిరం కేశవుడికే కాదు. శివుడికి కూడా ప్రీతికరంగా మారింది. తారకాసుర వధ జరిగింది కూడా ఈ మాసంలోనే. ఇలాగే 30రోజులకు ప్రత్యేకత ఉంది.
ముక్కోటి ఏకాదశి
వైకుంఠంలో బంగారు వాకిళ్ళు తెరుచుకొనే రోజు ముక్కోటి ఏకాదశి. సమస్త దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకొనే రోజే ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి. ఉత్తర ద్వారం ద్వారా భగవద్ధర్శనం మహా పుణ్యప్రదమంటారు. పరమాత్మ అర్జునునికి గీతోపదేశం చేసిన రోజుకూడా ఇదే. మార్గశిర పౌర్ణమి నాడే దత్తజయంతిని జరుపుకుంటారు. మనలో ధార్మికతను పెంపొందించటానికి, అలసత్వాన్ని వదిలించటానికి మన పెద్దలు మార్గశిర మాసంలో నిర్ధేశించిన ధార్మిక ప్రణాళికలే పూజలు, వ్రతాలు.