header

Sravanamasam…శ్రావణమాసం

Sravanamasam…శ్రావణమాసం

శ్రావణమాసంలో ప్రతి ఇల్లూ లక్ష్మీనివాసమే. పెళ్ళిప్రయత్నాలు, సేద్యపు పనులు ...మంచి పనులు ప్రారంభించటానికి ఇదే మంచిమాసమంటారు వేదపండితులు. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి రోజున శ్రవణా నక్షత్రంలో ఉంటాడు. అందుకే శ్రావణమాసమని పేరు. మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. దశావతారాల్లో కృష్ణావతారం ఈ మాసంలోనే మెదయ్యింది. శ్రీకృష్ణుడు శ్రావణబహుళ అష్టమినాడు దేవకీ వసుదేవు అష్టమగర్భంలో జన్మిస్తాడు. శ్రావణపౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి.
శ్రావణ శుక్రవారాలు : శ్రావణం దేవుడికి, భక్తుడికి అనుసంధానం కావించే మాసం.ఉపవాసం అంటే పరమాత్మకు దగ్గరగా వెళ్ళటం. లక్ష్మీదేవి కటాక్షంకోసం శ్రావణపౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేస్తారు. అలా కుదరకపోతే ఎదో ఒక శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేస్తారు. పోలాల అమావాస్య : శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ రోజు పాడిపశువులను శుభ్రంగా కడిగి కుంకుమదిద్ది హారతులిస్తారు. మనిషికి-పశువుకు మధ్యవుండే అనుబంధాన్ని చాటే పండుగ పోలాల అమావాస్య.
భానుసప్తమి : సమస్త ప్రపంచానికి వెలుగులు పంచే ప్రత్యక్ష భగవానుడైన సూర్యునికి నమస్కారాలు సమర్పిస్తూ భానుసప్తమిని ఘనంగా నిర్వహిస్తారు.
శ్రావణ మంగళవారాలో గౌరిదేవి వ్రతమాచరిస్తారు. శ్రావణమాసం సోమవారాలలో శివుణ్ణి ఆరాధిస్తారు.
శ్రావణపౌర్ణమి : ఇస్తినమ్మ వాయనం...పుచ్చుకొంటినమ్మ వాయనం... శ్రావణమాసపు వాయన దానాల్లో ముత్తైదువలు చెప్పుకునే మాట నిజానికి ఇది వాయనం కాదని వాహనం అని అంటారు. అంతిమ ఘడిల్లో వైకుంఠం నుంచి దేవదూతలుల తీసుకొచ్చే దివ్యవాహనం. కడదాకా నీ దాతృత్వమే నిన్ను కాపాడుతుంది అన్న సత్యాన్ని మన పెద్దలు ఇలా చెప్పించారన్నమాట.
శ్రావణపౌర్ణమి రోజే రక్షాబంధనం లేక రాఖీపౌర్ణమి. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు రక్షాబంధనం యెక్క ప్రాధాన్యతను వివరిస్తాడు. సోదరీమణులు సోదరులకు రాఖీకట్టి రక్షకోరతారు. ఈ వేడుక గురించి పురాణాల్లో కూడా చెప్పబడింది.