header

Uttarayanam, Dakshinayanam... ఉత్తరాయణం మరియు దక్షిణాయనం

Uttarayanam, Dakshinayanam... ఉత్తరాయణం మరియు దక్షిణాయనం మన పూర్వీకులు సంవత్సరాన్ని రెండుగా విభజించి ఆయనములు అని పేరు పెట్టారు. మొదటిది ఉత్తరాయణం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశంతో ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయణం ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది. ఖగోళ శాస్త్రం ప్రకారము ప్రతి సంవత్సరము, జనవరి 15 నుండి జూలై 15 వరకు ఉత్తరాయణం అని జూలై 16 నుండి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయణం అని అంటారు. ఉత్తరాయణం ఆరునెలల కాలం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కాలంలో పుణ్యకార్యాలు శుభఫలితాలనిస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలకు కూడా ప్రశస్తమైనది.
మానవమాత్రులకు రాత్రి పగలు మాదిరిగా దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయణం రాత్రి అన్నమాట. మన పూర్వీకులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు . సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తరదిశలో ఉన్నట్లు కనిపించునప్పుడు ఉత్తరాయణం అని , సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణముగా సంచరించునట్లు కనిపించినప్పుడు దక్షిణాయణం అని పిలిచారు . ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం అయితే 6 నెలలు దక్షిణాయనం . ఇంతటి మార్పుకు సంబంధించిన రహస్యాన్ని లోకం లోని అతిసామాన్యులకు అర్ధమయ్యేలా వివరించేందుకు పండగను చేసుకునే అలవాటును ప్రచారం లోనికి తెచ్చారు . పూర్వం భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛందమరణాన్ని కోరుకున్నాడు.