పాలకడలిపై శేషతల్పంపై శయనించిన స్వామి వైకుంఠ ఏకాదశి రోజున కోటి వెలుగులతో దర్శనమిస్తాడు..ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుని దర్శించుకునే రోజు
కాబట్టి ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. తిరుమలతో సహా అన్ని దేవాలయాలలో ఉత్తరంవైపున ఉండే వైకుంఠద్వారాన్ని తెరుస్తారు ఈ రోజున. సౌరశక్తి ఉత్తరాయణానికి మారే సుదినం. గాయత్రిని మించిన మంత్రం, తల్లిని మించిన దైవం, కాశీని మించిన క్షేత్రం , ఏకాదశిని మించిన వ్రతం లేదంటాయి శాస్ర్తాలు. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా వసించడం.
వైకుంఠ ఏకాదశి రోజున ఉపవశించే భక్తులంటే మహావిష్ణువుకు ప్రీతి.ఉపవాస వ్రతంలో మౌనం కూడా అంతర్లీనమై ఉంటుంది. ఉపవాసం కారణంగా జీర్ణవ్యవస్థకు కూడా కాస్త విశ్రాంతి దొరకుతుంది.
ప్రహ్లాద, , నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుకశౌనకాదులు, భీష్ముడు ఏకాదశి వ్రతాన్ని పాటించే పరమపదానికి చేరుకున్నారని పురాణాలు చెబుతున్నాయి.