header

Vaisakha Masam / వైశాఖ మాసం...

Vaisakha Masam / వైశాఖ మాసం...

తెలుగునెలల్లో రెండో మాసం వైశాఖం. వసంత రుతువులో వచ్చే ఈ మాసంలో ఎండ తీవ్రత ఎక్కువగా వుంటుంది. నిర్మలమైన ఆకాశంతో పాటు రాత్రిళ్లు ఆహ్లాదకరంగా వుంటాయి. ఈ మాసంలో పండ్లకు రాజైన మామిడిపండు దిగుబడులు ఎక్కువగా వస్తుంటాయి.
వైశాఖంలోనే మహామహులు జన్మించడం విశేషం. ప్రపంచానికి శాంతి మార్గం ప్రబోధించిన గౌతమబుద్దుడు, అద్వైత సిద్ధాంతాన్ని ఆ సేతు హిమాచలం ప్రచారం చేసి హైందవ మత పటిష్టతకు కృషి చేసిన శంకర భగవత్పాదులు, విశిష్టాద్వైత ప్రచారకర్త రామానుజాచార్యులు, పదకవితా పితామహుడు అన్నమాచార్యులు, కర్ణాటక సంగీత దిగ్గజం త్యాగయ్య... తదితరులు భువిపై అవతరించిది ఈ మాసంలోనే కావడం గమనార్హం.
శివుని తలపై వున్న గంగానది కూడా ఈ మాసంలోనే భువిపైకి అడుగిడిందని పురాణాలు తెలుపుతున్నాయి.శ్రీమహావిష్ణువు పరశురాముడిగా జన్మించింది, అక్షయతృతీయ తిథి కూడా ఈనెలలోనే వస్తాయి. తిరుమలేశుని సేవలో తరించిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జన్మించింది వైశాఖమాసంలోనే.
అక్షయమంటే తరగదని అని అర్ధం. త్రేతాయుగం ఈ తిధి నాడే ప్రారంభమయింది. అందుకునే అక్షయతృతీయను భాగ్యవంతమైన దినంగా భావించి పూజలు చేస్తుంటారు. ఎండ తీవ్రత ఎక్కువగా వున్నా ఈ మాసంలో పిల్లలకు సెలవులు వుంటాయి.
అందుకనే పెద్దలు, పిల్లలు తీర్థయాత్రలు చేస్తుంటారు. దీంతో ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు వివిధ ప్రదేశాల్లోని సంస్కృతి, కట్టుబాట్లు పిల్లలకు తెలుస్తాయి.