header

Dhupam / Harati

ధూపం ఎందుకంత ప్రత్యేకం? ...హారతి ఎందుకు ఇస్తాం? .....డా.అనంతలక్ష్మి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త

నిప్పుల్లో సాంబ్రాణి, గుగ్గిలం, అగరులాంటివి వేస్తారు. ఇవన్నీ చెట్ల నుంచి వచ్చేవే. వాసన మనిషిని ఉత్తేజపరుస్తుంది. అరోమాథెరపీ అనే పదం వినే ఉంటాం. మిడతలా ఎగిరే మనసును కట్టడి చేయాలంటే మంచి పరిమళంతోనే సాధ్యం మరి! అంతేకాదు, మన దగ్గర కొంచెమే ఉంది. దాన్ని పదిమందికీ పంచాలి అనే భావనను కూడా ఈ ధూపం చక్కగా ప్రతిబింబిస్తుంది.
హారతి ఎందుకు ఇస్తాం?
కర్పూరానికి అలసటను దూరం చేసే శక్తి ఉంటుంది. సాధారణంగా భగవంతునికి ఇచ్చే హారతికైనా, పూజ తర్వాత మనకిచ్చే మంగళహారతికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. అంతేకాదు వృత్తాకారంలో దైవం చుట్టూ హారతిని తిప్పడం వల్ల ఉత్పన్నమయ్యే శక్తి నాలుగు దిశలకూ ప్రయాణిస్తుంది. మనం హారతిని కళ్లకు అద్దుకోవడంవల్ల ఆ తరంగాలు మన అరచేతుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. హారతి సమయంలో చేసే ఘంటానాదం సాంత్వననిచ్చే తరంగాల సృష్టికి సహకరిస్తుంది.