వీరు సుప్రసిద్ధ రచయిత. ‘నారాయణరావు’ వీరి ప్రసిద్ధ రచన. వీరు చిత్రకారులు, సంపాదకుడు, శిల్పి, సంగీత నాట్య శాస్త్రాలలో ప్రవీణుడు. 1944 లో హైదరాబాద్లో మీజాన్ పత్రికకు సంపాదకునిగా పనిచేసారు. వీరు సహృదయుడు, స్నేహితుల వివాహాలలో మొహమాటం లేకుండా మంగళ హారతులు పాడేవారు. వచన, రచనలలో సృజనాత్మకత చూపేవారు.
వీరి ప్రముఖ రచనలు గోనగన్నారెడ్డి, హిమబిందు, అంశుమతి, అడవి శాంతిశ్రీ చారిత్రాత్మక నవలలు. నారాయణరావు, నరుడు, జాజిమల్లి, కోణంగి, తుఫాను సాంఘిక నవలలు.
గుంటూరులో కళాపీఠం ఏర్పాటుచేసారు. తెలుగులో పేరుపొందిన ‘బావా బావా పన్నీరు’ పాటను వీరు రచించారు.
వీరు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 1898 అక్టోబరు 8వ తేదీన జన్మించారు. రాజమండ్రిలో బి.ఏ చదివారు. తరువాత మద్రాసు లా కాలేజిలో లా చదివారు.
వీరికి చిన్నతనం నుండి కవితలు రాసే అలవాటు ఉండేది. సముద్రగుప్తుడు, తిక్కన చిత్రాలను చక్కగా చిత్రీకరించారు. విశ్వనాథ సత్యనారాయణ వారి కన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడేవి.
వీరు చిత్రించిన శబ్ధబ్రహ్మ అనే చిత్రం డెన్మార్కు దేశంలోని ప్రదర్శనశాలలలో ఉంది. తరువాన్ కూరు మ్యూజియంలో భాగవత పురుషుడు, ఆనందతాండవం చిత్రాలున్నాయి.
వీరు చాలా కథాసంపుటాలు, కథలు, రేడియో నాటికలు, నవలలు వ్రాసారు.
వీరు 1952వ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన పరమపదించారు.