సంస్కృతంలో గొప్ప విద్యాంసుడుగా ప్రసిద్ధి పొందిన ఈ కవి ఆంధ్రుడే. ఈయన గుంటూరు జిల్లా గరికపాడు వాస్తవ్యుడనీ, 15వ శతాబ్ధంలో జీవించాడనీ కొందరూ, 18 వ శతాబ్ధం తొలిపాదం వాడని మరి కొందరి అభిప్రాయం. ఈయన వ్రాసిన తర్క సంగ్రహం న్యాయశాస్త్రం అధ్యయనం చేసేవారికి తొలి పాఠ్యగ్రంధంగా భారతదేశం అంతటా ఉంది. మీమాంస, వేదాంతం, వ్యాకరణాలకు సంబంధించిన గ్రంధాలను కూడా ఈయన రచించాడు.