హాస్యబ్రహ్మగా పేరుపొందిన హాస్యనాటక కర్త,.రచయుత. బాగుబాగు, కచటతపలు, పెళ్లి ట్రయినింగ్ ఇతని రచనలు. ఇతను పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో 1897 ఏప్రియల్ 28వ తేదీన జన్మించారు. భీమవరంలో పాఠశాల విద్యను, పిఠాపురంలో గణిత శాస్తంలో పట్టా పొందారు.
నరసాపురం, కాకినాడలలో ఉపాధ్యాయునిగా పనిచేసారు.
త్యాగరాజు రచనలను, జీవితాన్ని పరిశీలించి త్యాగరాజు ఆత్మవిచారం రచన గావించారు. వీరు హాస్య ప్రధానమైన నాటికలు రాసారు. వీరి హాస్య రచనలు చదువరికి చురుక్కుమనిపించేలా ఉంటాయి. వినయ ప్రభ, బాగుబాగు, ఎప్పడూ ఇంతే, కచటతపలు వీరి నాటికలలో ముఖ్యమైనవి. ఇంకా అనేక కథలు, వ్యాసాలు అనేకం వ్రాసారు.
తన హాస్య రచనలతో ఎంతోమందిని అలరించిన వీరు 1958 ఆగస్టు 28వ తేదీన మరణించారు.