header

C. Naraya Reddy…సి. నారాయణ రెడ్డి

C. Naraya Reddy…సి. నారాయణ రెడ్డి
వీరు మహావక్త, గేయకవి. విశ్వంభర అను కావ్యాన్ని రచించారు. ఈ కావ్యానికి ‘జ్ఙానపీఠ్’ అవార్డు 1989లో వచ్చింది. వీరు సినారేగా సినిమా గేయాలు రాసి పేరుపొందారు.
వీరు 1931 జులై 29 తేదీన తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్ హనుమాజీపేటలో జన్మించారు. వీరి తండ్రి రైతు. తల్లి గృహిణి. నాటి హైదరాబాద్ రాజభాష ఉర్దూ కావటంచేత నారాయణ రెడ్డిగారి చదువు ఉర్దూ మీడియంలో సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీ పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక పురస్కారాలు పొందారు. రాజ్యసభ సభ్యనిగా సేవలందించారు.
నారాయణ రెడ్డి స్వతహాగా కవి కానీ వీరు పద్య గేయకావ్యాలు, వచనకవితలు, సంగీత నృత్యరూపకాలు, బుర్రకథలు, గజల్స్, అనువాదాలు మున్నగునవి ఎన్నో రాశాశారు.
సినిమాలకు 3,500 పాటలు రాశారు. వీరి గ్రంధాలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, సంస్కృతం. హిందీ, మళయాళం, ఉర్దూ, కన్నడ భాషలలోనికి అనువాదమయ్యాయి. భారతప్రభుత్వం వీరి సేవలకు ‘పద్మభూఫణ్’ ఆవార్డుతో సత్కరించింది, చాలా విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ తొ గౌరవించాయి.
వీరు 2017 జూన్ 12వ తేదీన కన్నుమూసారు.