తెలుగునాట భావకవిత ఉద్యమానికి ఆద్యుడు, కృష్ణపక్షం, ఊర్వశీ ప్రవాసం ఈయన ప్రధాన రచనలు, సీనీ గేయ రచయితగా సుప్రసిద్ధుడు.
ఈయన రేడియోకు లలితగీతాలు, నాటికలు సినిమాలకు పాటలు వ్రాయటం ద్వారా పేరు పొందారు. 1929లో రవీంద్రనాథ్ ఠాగూరును కలిసి ప్రభావితుడైనారు. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు వ్రాసారు.
వీరు 1897 నవంబరు 1వ తేదీన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గరలోని రావువారి చంద్రపాలెం అనే గ్రామంలో జన్మించారు. పిఠాపురంలో హైస్కూల్ విద్య విజయనగరం కళాశాల విద్య పూర్తి చేశారు. చిన్న వయసునుండే రచనలు చేసేవాడు. పిఠాపురంలో ఉపాధ్యాయునిగా పని చేశారు. ఎందరో కళావంతులకు వివాహాలు చేసాడు. ఈ సమయంలోనే ఊర్వశి అనే కావ్యాన్ని రచించాడు.
తరువాత కాకినాడ కాలేజీలో అధ్యాపక వృత్తిని చేపట్టాడు. ఈ సమయంలోనే మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాసారు. అనేక సినిమాలకు సాహిత్యం అందించారు. 1957 లో ఆకాశవాణిలో చేరి అనేక ప్రయోక్తగా అనేక నాటకాలు ప్రసంగాలు అందించారు.
గొప్ప వక్త, రచయిత, 1980 ఫిబ్రవరి 24వ తేదీన మరణించారు. 1976లో భారతప్రభుత్వం వీరిని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.