ఇతను దేశభక్తి గీతాలు రాసిన జాతీయకవి. ఈయన వ్రాసిన ‘‘మాకొద్దీ తెల్లదొర తనము’’ గీతం జాతీయోద్యమకాలంలో మారుమ్రోగింది. స్వాతంత్ర్య ఉద్యమ కవులలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న కవి. దేశభక్తి కవితలు వ్రాసినందుకు జైలుశిక్షలు అనుభవించిన కవి. ఈ పాటను వ్రాసినందుకు బ్రీటీష్ ప్రభుత్వం ఇతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు.
వీరు 1893, జులై 14వ తేదీన శ్రీకాకుళం జిల్లా గోనెపాడులో జన్మించారు. వీరు ఆరోజులలోనే బి.ఏ చదువుకున్నారు. విజయనగరం ఉన్నతపాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసారు.
వీరు కేవలం రచయిత కాక గొప్ప గాయకుడు కూడా. వీరు చివరి దశలో పేదరికంతో చాలా బాధపడ్డారు. పక్షవాతం వచ్చింది, ఒక కన్నుపోయింది. ఇంతటి మహనీయుడు యాచిస్తూ కొంతకాలం గడిపారు. మరణించిన తరువాత ఇరుగు పొరుగు వారు అంత్యక్రియలు జరిపారు. ఇంతటి దేశభక్తునికి, కవికి స్వాతంత్రానంతరం కూడా ఏ మాత్రం సాయం అందకపోవటం తెలుగుజాతికి తీరని అవమానం.
స్వరాజ్య గీతములు, హరిజనుల పాటలు, ఖంఢకావ్యములు, భక్తిగీతాలు, బాలగీతాలు వీరి రచనలు.
వీరు 1952 డిసెంబర్ 18వ తేదీన మరణించారు.