వీరు బహుహాషా కోవిదులుగా పేరు పొందారు. 1881 డిసెంబర్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా మినుమంచిలిపాడులో జన్మించారు.
ఆంధ్రుల చరిత్ర, ప్రాచీన వైభవం, సంస్కృతి మొదలైన వాటిని గురించి అధ్యయనం చేసి పలు గ్రంధాలు వ్రాసారు. వీరు తెలుగు చారిత్రక పరిశోధకులు. పురాతన లిపి శాస్త్రజ్ఙుడు. ఆంధ్ర చరిత్రకారులలో ఆగ్రగణ్యడు. అనేక కథలు, నాటకాలు, నవలలు అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి. అనేక శాసనాలు అధ్యయనం చేశాడు. ఇతని అన్వేషణ ఫలితంగానే అశోకుని ఎర్రగుడిపాడు శాసనం, పల్లవ, తెలుగు, చోడ, రెడ్డి రాజుల శాసనాలు వెలుగులోని వచ్చాయి.
తను సేకరించిన శాసనాలను విశ్లేషించి అనేక పత్రికలలో వ్యాసరూపంలో ప్రచురింపజేసాడు. తెలంగాణా, కాకతీయులకు చెందిన 80 శాసనాలను చిన్న వ్యాఖ్యలతో ప్రచురించాడు.
వీరి రచనలలో ముఖ్యమైనది ‘The History of Reddi Kingdom and Kondaveedu and Rajahmundry’ ఈ రచనలో ఆంధ్రదేశానికి చెందిన విజయనగర, వెలమ, బహమనీ, ముసునూరు రాజ్యాల చరిత్రను వివరించే గ్రంధం ఇది. అనేక శాసనాలను, కవుల కావ్యాలను పరిశీలించి తయారుచేసిన ఉత్తమ రచన ఇది. రాగతరంగిణి (చిన్నకథ), విజయతోరణము (నాటికలు) ఆంధ్రసంస్కృతి, తరంగణి, ఆంద్రదేశ చరిత్ర సంగహము, రెడ్డిరాజుల చరిత్ర, అమరావతి స్థూపం వీరి ఇతర రచనలు
1963 జనవరి 7వ తేదీని పరమపదించారు.