వీరు ప్రపసిద్ధ హాస్య రచయిత. వీరు వ్రాసిన సాంసారిక నవలలో కాంతం పాత్ర సృఫ్టించిన ఘనకీర్తిని పొందారు.ఈ పాత్ర తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. కుటుంబజీవితాలలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితంలోని సౌందర్యం వీరి రచనలలో ప్రస్పుటమవుతాయి.
వీరు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని సంగం జాగర్లమూడిలో మార్చి 15, 1898లో జన్మించారు. ఆ కాలంలోనే బి.ఏ. చదివారు.
ఈయన వ్రాసిన మొదటి నవల టీకప్పులో తుఫాను. ఇందులోని కాంతం పాత్ర కనపడుతుంది. ఈయన రాసిన కథలు చిన్న సంఘటలను మీద ఆధారపడి వ్రాసినవి. ఇప్పటికీ జనాలకు గుర్తున్నాయి. హాస్యరచయితలతో వీరి ప్రముఖ స్థానం ఉంది. వీరి కుమారుడు మునిమాణిక్యం రఘునాధ యాజ్ఞ వల్క్య కూడా రచయితే.
వీరి ప్రముఖ రచనలు దాంపత్యోనిషత్తు, గృహప్రవేశం,హాస్య కుమావళి, మాణిక్య వచనావళి, తెలుగు హాస్యం, ఇల్లు, ఇల్లాలు, మంచివాళ్ల మాటతీరు, యదార్థదృశ్యాలు, కాంతం కైఫీయత్తు, ఇంకా అనేకం ఉన్నాయి.