సంగీత సాహిత్యాలలో పరిశోధనలు చేసిన పండితుడు మరియు విమర్శకుడు.
అన్నమాచార్యుల వారి కొన్ని వందల కృతులను స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని రాసారు సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమానమైన ప్రతిభగల వారు. రెడియో ప్రసారాలకు ఆకాశవాణి అని పేరుపెట్టింది వీరే.
‘నిగమశర్మ అక్క’, ‘నాచన సోముని నవీన గుణములు’, ‘తిక్కన తీర్చిన సీతమ్మ’, ‘రాయలనాటి రసికత’ అనే ఆయన వ్యాసాలు బాగా పేరుపొందినవి. కాళిదాసు రచించిన రఘువంశం ఆంధ్రీకరించారు. ‘పెద్దన పెద్దతనము’ అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశారు.
వీరు అనంతపురంలోని రాళ్లపల్లి అనే గ్రామంలో 1893 జనవరి 23వ తేదీన జన్మించారు. ఇతని తల్లి, జానపద గీతాలను కీర్తనలు శ్రావ్యంగా గానం చేసేది. తల్లి నేర్పిన పాటలను యధాతధంగా నేర్చుకున్నారు. రాళ్ళపల్లివారి సారస్వతోపన్యాసాలు, వారిని తెలుగు విమర్శకులలో అగ్రగణ్యునిగా చేశాయి. పీఠికా రచనలో కూడా రాళ్ళపల్లి గొప్ప పేరు గాంచారు.
శర్మగారు రచించిన ”గానకలె”, జీవమత్తుకలె” అన్న గ్రంథాలు వారి కన్నడ భాషా వైదుష్యానికి మచ్చుతునకలు. సంగీత, సాహిత్య రంగాలలో విశిష్ట సేవలందించిన శర్మగారిని 1979 మార్చి 11న తి.తి.దేవస్థానం వారు ఆస్థాన విద్వాంసులుగా నియమించారు.
1979 మార్చి 11వ తేదీన ఈ మహనీయుడు అస్తమించారు.