వీరు ఆధునిక తెలుగు కవి. కలభాషిణి, భోజరాజవిజయం, గౌతమీ మహత్యం, శ్రీకృష్ణ భారతం మున్నగు గ్రంధాలను రచించారు.
వీరు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన ఎర్నగూడెంలో అక్టోబర్, 1866, 29వ తేదీన జన్మించారు. చిన్నతనంలోనే కవిత్వం చెప్పారు.
వీరు ఆంధ్రప్రదేశ్ కు తొలి ఆస్థానకవి. హర్షుడు వ్రాసిన ‘నైషధ చరిత్ర’ను, శ్రీనాథుడు వ్రాసిన ‘శృంగార నైషధం’ గ్రంధాలను మూలం చెడకుండా మరలా రచించారు. వీరు రామాయణ, మహాభారత, భాగవతాలను అనువదించటమే కాకుండా వందకు పైగా గ్రంధాలను వ్రాసారు. పద్యం, గద్యం, లలితపదాలు ఇతని రచనలలో స్పష్టంగా కనపడతాయి. స్మార్తం, వేదం, శ్రౌతం నేర్చిన పండితుడు. వీరు తన తండ్రి చేసిన యజ్ఞానికి అధ్యక్షత వహించాడు. ఇంటికి వచ్చినవారికి, చివరికి శత్రువులైనా సరే భోజనం పెట్టిన మహనీయుడు.
ప్రసిద్ధి చెందిన బొబ్బిలి యుద్దాన్ని నాటక రూపకంగా అందించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పోరేషన్ మ్యూజియం పార్కులో ఈయన విగ్రహాన్ని స్థాపించారు.
వీరు1960 డిసెంబర్ 29వ తేదీన మరణించారు.