header

Viswanath Satyanarayana…విశ్వనాథ సత్యనారాయణ

Viswanath Satyanarayana…విశ్వనాథ సత్యనారాయణ
ఇతను గొప్ప కవి, నవలా రచయుత,. కృష్ణాజిల్లా నందమూరు గ్రామం ఇతని జన్మస్థలం.
వేయిపడగలు, రామాయణ కల్పవృక్షం రాసిన మహాకవి. జ్ఙానపీఠ్ అవార్డు పొందిన మొదటి తెలుగు కవి. తెలుగు సాహిత్య ప్రక్రియ‌ల్లో విశ్వనాథ వారు స్పృశించని ప్రక్రియలేదు. తన రచనల ద్వారా కులాతీత, మతాతీత విధానాలను ఎండగట్టారు.
ఆంధ్ర పౌరుషం, ఆంధ్రప్రశస్తి ఆయన మొదటి రచనలలోనివి. తరువాతవి రామాయణ కల్పవృక్షము, వేయిపడగలు, కిన్నెరసాని పాటలు, పురాణవైర గ్రంథమాల, కాశ్మీర చారిత్రిక నవలలు. చారిత్రక నవల చద్దెన్న సేనాని ఆయనకు ప్రతిష్ఠ తెచ్చింది. నన్నయ్య, నాచనసోమన, అల్లసాని పెద్దన, కాళిదాసుల కవితా ధోరణుల మీద ఆయన రాసిన విమర్శనాత్మక వ్యాసాలు ఆణిముత్యాలు.
ఆయన పద్య రచన అపూర్వం. సంస్కృత నాటకాల్లో గుప్త పాశుపతం, అమృత శర్మిష్ట తెలుగు నాటకాల్లో కనకరాజు, అనార్కలి ప్రసిద్ధమైనవి.
భారతప్రభుత్వం 1970 సం.లో విశ్వనాధుని ‘పద్మభూషణ్’ అవార్డుతో సత్కరించింది.
విశ్వనాథ సత్యనారాయణ 1895 సెప్టెంబరు 10న కృష్ణా జిల్లాలోని నందమూరులో జన్మించారు. 1976 అక్టోబరు 18న అస్తమించారు