వీరు మహా పండితుడు. తాళ్లపాక అన్నమాచార్యుని పదకవితలను ప్రచారం చేసిన సుప్రసిద్ధ పరిశోధకుడు, రచయుత, రేడియో నాటక రచయిత. వీరు కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని పెదకళ్లేపల్లిలో1888 సం. ఫిబ్రవరి 7వ తేదీన జన్మించారు.
వీరు తెలుగులో అనేక కావ్యములు రచించటంతో పాటు అనువాదాలు చేసారు. వివరణా గ్రంధాలు వ్రాసారు. వీరు అనువాదాలు కొన్ని-శృంగార శ్రీనాధం, క్రీడాభిరామం, బసవపురాణం, రంగనాథరామాయణం, ప్రాచీనాంద్రశాసనములు, ధనుర్యిద్యా విలాసం మొదలగునవి.
వీరు కొన్ని సంస్కృత నాటకాలను కూడా తెలుగులోనికి అనువదించారు. అవి మత్తవిలాసం, నాగానందం.
వీరు 1950 ఆగస్టు 29వ తేదీన ఈ లోకం నుండి నిష్ర్కమించారు.