ఈయన కడప జిల్లాకు చెందిన వాడు. క్రీ.శ 1500 నుండి క్రీ.శ 1565 కాలానికి చెందినవాడుగా భావిస్తున్నారు. అయ్యaరాజు వంశానికి చెందిన అయ్యరాజు తిప్పయ్యగారి మనుమడుని ఆరుద్ర గారు చెప్పారు. ఈ అయ్యలరాజు తిప్పగారే ఒంటిమిట్ట రఘువీర శతకకర్త. రామభద్రుడు వ్రాసిన ''రామాభ్యుదయాన్ని'' శ్రీకృష్ణ దేవరాయల అల్లుడైన అళీయ రామరాయల
మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు.
రామాభ్యుదయము ఎనిమిది ఆశ్యాశాల ప్రబంధము. ఇందులో కొన్ని చమత్కారాలు శూర్పణఖ ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడు కాదని చెప్పడం. ఈ కావ్యం వ్యాకరణానికి, అలంకార శాస్త్రానికి చక్కని ఉదాహరణ. రామకథను ప్రబంధకావ్యంగా వ్రాయడం అయ్యలరాజు యొక్క గొప్ప ప్రయోగం.