రామరాజ భూషణుడుగా పేరుగాంచిన భట్టుమూర్తి తెలుగు కవి మరియు సంగీత విద్యాంసుడు.శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళీయ రామరాయలు ఆస్థానమునకు ఆభరణము వలె ఉండుట వలన ''రామరాజ భూషణుడు'' అనే పేరు వచ్చినది. భట్టుమూర్తి నెల్లూరు ప్రాంతమునకు చెందినవాడుగా భావించుచున్నారు.
ఇతని రచనలు వసుచరిత్రము, నలోపాఖ్యానము మరియు సరస భూపాలీయము (కావ్యాలంకార సంగ్రహము మరోపేరు) అనే కావ్యములు. వసుచరిత్ర వీటన్నిలోని ప్రసిద్ధమైనది. కావ్యాలంకార సంగ్రహము భట్టుమూర్తి రచించిన మొది గ్రంధము. సరసభూపాలీయమని దీనికి మరోపేరు.
కావ్యధ్వని రసాలంకారములను గురించి, నాయికా నాయకులను గురించి, గుణదోషములను గురించి ఇందులో వివరించబడినది. నాలుక కదలనక్కరలేని అక్షరమాలతో రచించిన అలజిహ్యము. ఇది సంస్కృతములో విద్యానాధుడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణమును అనుసరించి వ్రాయబడిన గ్రంధము.