header

Nandi Timmana….నందితిమ్మన

Nandi Timmana….నందితిమ్మన

నంది తిమ్మనను ముక్కుతిమ్మన అనికూడా అంటారు. ముక్కు పెద్దదిగా ఉండటం వలన మరియు కవితలలో ముక్కును చక్కగా వర్ణించడం వలన ఇలా పిలుస్తారు.తిమ్మన, రాయలు భార్య తిరుమలదేవితో అరణంగా వచ్చినవాడు. ఇతను అనంతపురానికి చెందినవాడని అంటారు.
తల్లిదండ్రులు సింగన్న, తిమ్మాంబ దంపతులు. తిమ్మన జన్మతః శైవుడు, అఘోర శివాచార్యుల శిష్యుడు. ఈయన తాత నంది మల్లయ్య మరియు మేనమామ ఘంట సింగన్న (మలయ మారుత కవి) కృష్ణదేవరాయల తండ్రి అయిన వీరనరసింహరాయ ఆస్థానంలో ఉండేవారు. తిమ్మన తన సమకాలికుడైన పెద్దన వలే క్లిష్ట పదప్రయోగాలు కాకుండా సున్నితమైన, సులువైన పద్ధతిలో రచనలు చేసేవాడు. ఈ రచనలు పండితులకే కాక పామర జనులను కూడా విశేషంగా ఆకర్షించేవి. అందుకే ముక్కు తిమ్మన ముద్దు పలుకులు అని వ్యవహరిస్తారు.
ఇందుకు ఉదాహరణ పారిజాతాపహరణంలోని సుకుమార, శృంగార, రసాత్మకమైన పద్యాలు. ఇతని రచనలు : వాణీవిలాసం, పారిజాతాపహరణం. (వాణివిలాసం లభ్యం కావటంలేదు)