తెలుగు సాహిత్యమును ఏలిన కవులలో పింగళి సూరన ఒకరు. సూరన రాఘవ పాండవీయము అనే ఒక అత్యుద్భుతమైన శ్లేష కావ్యమును రచించెను. ఈ కావ్యంలోని ప్రతి పద్యమును రామాయణంలోని కధకు, భారతంలోని కధకు ఒకేసారి అన్వయించుకోవచ్చును. పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయము దక్షిణ ఆసియాలోనే మొట్టమొది నవలగా భావిస్తారు. మరియు తెలుగు సాహిత్యంలో మొట్ట మొదటి కావ్యంగా పరిగణిస్తారు. కళాపూర్ణోదయము ప్రేమకావ్యము.
ఇతని తల్లి అబ్బమాంబ తండ్రి అమరన్న. ఇతను నంద్యాలలోని కనాల గ్రామములో నివసించేవాడని భావిస్తున్నారు. కనాల గ్రామములో ఉన్న సమాధిని సూరన సమాధి అంటారు. ప్రతి సంవత్సరము ఇక్కడ కుమ్మరులు సూరన జయంతిని జరుపుతారు. సూరనకు సంబంధించిన స్కూలు సూరన సారస్వత సంఘం ఇక్కడ ఉన్నవి.
పింగళి సూరన ఇతర రచనలు : గిరిజా కళ్యాణము, గరుడపురాణము (తెనుగించాడు) రాఘవపాండవీవము. కళాపూర్ణోదయము - అరవీటి తిమ్మరాజ వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు.