header

Baddena Kavi....బద్దెన కవి

గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని చందవోలుకు చెందినవాడు మంచన. ఇతని కాలము క్రీ శ. 1300 ప్రాంతం. ఇతడు "కేయూరబాహు చరిత్ర" అను గ్రంధాన్ని రచించాడు. సంస్కృతంలో రాజశేఖర కవి రచించిన "విద్ధసాలభంజిక అను నాలుగు అంకాల నాటికకు ఇది చంపూ రూపమైన స్వతంత్రానువాదం.
సంస్కృతంలోని దృశ్య కావ్యాన్ని శ్రవ్య కావ్యంగా అనువదించుటకు ఆరంభం కేయూరబాహు చరిత్రతోనే ఆరంభమయింది. మంచన కవిత్వం సలక్షణం సరసమైంది.
ఇతని పదభావ సంపద, రచనా ప్రౌఢిమ, ధారాశుద్ధి ఎన్నదగినది. మంచన తన కేయూరబాహు చరిత్రను వెలనాటి చొళ రాజామాత్యుడైన నండూరి గుండ మంత్రికి అంకితమిచ్చాడు. మంచెన వ్రాసింది ఒకే ఒక్క కావ్యమైనా జగద్విఖాతినొందినది.