గోన బుద్దారెడ్డి 1375 లో జన్మించాడు. తెలుగులో వెలిసిన మొట్టమొదటి రామాయణమైన "రంగనాధ రామాయణము"ను రచించాడు.
ఈతని తండ్రి పేరు రంగనాధుడు.
తన తండ్రి పేరుతో ఈ రామాయణాన్ని రచించినందువల్ల ఆ పేరు వచ్చిందని పరిశోధకుల అభిప్రాయం. సేతువు కడుతున్నప్పుడు రాముల వారికి ఉడుత చేసిన సాయం కథ గోన బుద్ధారెడ్డిదే.
ఆనాటి నుంచే "ఉడుతాభక్తి" అనే జాతీయం ఆవిర్భవించింది. ద్విపదలో రాసిన ఈ రామాయణమును యుద్ధకాండ వరకు మాత్రమే ఈయన రచించాడు. మూలంలో లేని తెలుగుదనాన్ని,
దేశీయతా సొంపును చేకూర్చాడు.
ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణ దేవర నవ్వు మొదలగునవి రంగనాధ రామాయణములోని దేశీయ కథలు. సామాన్యులకు కూడా ఈ రామాయణం సాహిత్యపు ఆనందాన్ని సమకూర్చిపెట్టింది