header

Mallikarjuna Pandithudu...మల్లికార్జున పండితారాధ్యుడు

Mallikarjuna Pandithudu...మల్లికార్జున పండితారాధ్యుడు
12వ శతాబ్దానికి చెందిన మల్లికార్జున పండితారాధ్యుడు గోదావరి మండలానికి చెందినవాడు. బాల్యం నుండి వివేకవంతుడు. శైవ మత రహస్యాలను తెలుసుకున్నాడు. భక్తుల చరిత్రములను, మహిమలను వర్ణించాడు. ఎందరో బౌద్ధ పండితులను ఓడించాడు. తన మతమును తీవ్రంగా ప్రచారం చేశాడు. శైవ మతాన్ని సంస్కరించి ఆరాధ్య శాఖను నెలకొల్పాడు. సంస్కృతం, తెలుగు, కన్నడలలొ పండితుడు. ఇతని తెలుగు రచనలలో "శివతత్వసారము" ప్రధానమైనది. ఇది వీర శైవ మత గ్రంధాలలో ప్రామాణికమైనది. తెలుగులో శతక కవిత్వాలకు తొలి ఉదాహరణముగ శివతత్వసారము పేర్కొనబడింది.