నాచన సోమన కవి క్రీ.శ. 1390 ప్రాంతానికి చెందినవాడు. సంస్కృతములోని హరివంశమునందలి ఉత్తర భాగాన్ని "ఉత్తర హరివంశం" అను పేర తెలుగులో రచించాడు. ఇది 6 ఆశ్వాసములుగల ప్రబంధము. వర్ణనలందు పురాణ పద్ధతిని విడనాడి ప్రబంధ మార్గాన్ని అనుసరించాడు. ఇతడు సందర్భానుసారంగా వాడే సామెతలు, జాతీయాలు మనోహరంగా ఉంటాయి. ఇతనికి "సర్వజ్ఞ సకల భాషాభూషణ" "సాహిత్య రసపోషణ" అనే బిరుదులు ఉన్నాయి.