header

Nandi Mallaiah/Ghanta Singanna... నంది మల్లయ్య, ఘంట సింగన

తెలుగు సాహిత్యంలోని తొలి తెలుగు జంట కవులు నంది మల్లయ్య, ఘంట సింగనలు. వీరికి 'రాచమల్లు కవులు అని పేరు కూడా ఉంది. వీరు గుంటూరు, నెల్లూరు మండలాల్లో 1480 ప్రాంతాల్లో ఉండేవారు.
వీరిలో ఘంట సింగన నంది తిమ్మనకు మేనల్లుడు. నంది ఘంట కవులు కొత్త కొత్త మాటలు వాడడమేగాక చిత్ర, బంధ, గర్భ కవిత్వాలలో కూడా తమాషాలు చేశారు. ప్రతిలోమానులోమ కందం వ్రాశారు. తొలినుంచి చదివినా, కొస నుంచి చదివినా ఈ క్రింది పద్యం ఒకేలా ఉంటుంది...
సారసనయనాఘనజఘ - నారచితరతారకలికహరిసారరసా
సారరసారహకలికర - తారతచిరనాఘజనఘనాయనసరసా".
అనే కాకుండా కేవలం రెండు అక్షరాలు మాత్రమే ఉపయోగించి ఒక కంద పద్యం రచించారు.
కాకలికాకలకలకల - కోకిలకులలీలకలులకులుకులకలుకే
కైకోకుకేలికొలకుల - కోకాలీకేలికులికొంకకుకలికీ" (వరాహపురాణం).
అలాగే ఒకే అక్షరంతో కూడా ఈ జంట కవులు ఒక పద్యం చెప్పారు...
నానననుని ననూనున - నేనేనిను ననన్ను నెన్న నీనీ
న్నానౌననోన్నినానౌ - నేనే నను నన్ను నాన నేను నన్నన్".

ఇలా కవిత్వాన్ని చిత్రవిచిత్రంగా పలికి మార్గదర్శకులయ్యారు ఈ జంట కవులు.