-
header

Jagannatha Panditha Rayalu....జగన్నాథ పండితరాయలు

Jagannatha Panditha Rayalu....జగన్నాథ పండితరాయలు

జగన్నాథ పండితరాయలు 17వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి మరియు విమర్శకుడు. తెలుగు వైదీకి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జగన్నాథ పండితరాయలు ఉత్తర భారతదేశంలో పండిత్‌రాజ్ జగన్నాథ్‌గా పేరుపొందాడు. తర్కాలంకార శాస్త్రాల్లో పేరెన్నిక గన్నవాడు. ఆంధ్రదేశానికి చెందిన తూర్పుగోదావరి జిల్లాలోని ముంగొండ అగ్రహారానికి చెందినవాడు. కానీ ఇతని జీవితంలో ఎక్కువభాగం ఉత్తర భారతదేశంలో గడచింది. మొగలు రాజుల సంస్థానంలో గొప్ప విద్వాంసునిగా పేరు తెచ్చుకున్నాడు. రసగంగాధరం, భామినీ విలాసము, గంగాలహరి మొదలైనవి ఆయన సుప్రసిద్ధ రచనలు
జగన్నాథుని తాతయైన కేశవభట్టు తన నాట్య ప్రతిభతో విజయనగర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలను మెప్పించి ముంగొండ అగ్రహారాన్ని బహుమానంగా పొందాడు ఈయన తండ్రి పేరు భట్టు. ఆయన కాశీలో పలు శాస్త్రాలను అభ్యసించి వచ్చాడు. జగన్నాథుడు తన తండ్రి దగ్గరే చాలా శాస్త్రాలు అభ్యసించాడు. జగన్నాథ వంశస్థులు వేగినాటి వారని ప్రతీతి.
జగన్నాథుడు జ్ఞానేంద్ర భిక్షువు వద్ద అద్వైతం, మహేంద్రుని వద్ద తర్కశాస్త్రం, ఖండదేవ సన్నిధిలో పూర్వ మీమాంస అభ్యసించారు. వ్యాకరణశాస్త్రం శేషవీరేశ్వర పండితుని వద్ద అధ్యయనం చేశారు. మొత్తంగా ఆయన వేదాంత, న్యాయ, వైశేషిక, మీమాంసా, వ్యాకరణ, సాహిత్యాది శాస్త్రాల్లో మహాపండితుడు. శేషవీరేశ్వర పండితుడు కాశీ నివాసి, జగన్నాథుని తండ్రికి కూడా గురువు. ఆయన వద్ద విద్యను అభ్యసించేందుకు జగన్నాథుడు కాశీ చేరుకున్నాడు.అనేకమైన శాస్త్రాలను అభ్యసించిన జగన్నాథుడు ఢిల్లీ చక్రవర్తి ఆస్థానంలో స్థానం పొందాడు. జహంగీరు ఆస్థానంలో చేరిన ఆయన తన ప్రతిభ కారణంగా సన్మానాలు, గౌరవాలు పొందాడు. ఆయన గ్రంథరచన మొత్తం ఢిల్లీలో ఉండగానే జరిగిందని పండితుల భావన. సంస్కృత అలంకార శాస్త్రంలో చివరిమాతగా గణుతికెక్కిన ఆయన సిద్ధాంతాలు, రచనలు, విద్వత్‌చర్చలు మొదలైనవన్నిటీకీ ఆనందించిన జహంగీరు జగన్నాథునికి పండిత్‌రాజ్ అనే బిరుదు ప్రదానం చేశాడు
జగన్నాథ పండితరాయలు ఆలంకారికునిగా సుప్రఖ్యాతుడు. సంస్కృత అలంకారిక శాస్త్ర అభివృద్ధిలో కీలకమైన ప్రతిపాదనలు చేసిన ఆధునికుడు. ఇతర సంస్కృత అలంకారికులతో పోలిస్తే ఆధునికుడు జగన్నాథుడే. ఆయన ప్రతిపాదనలు, సిద్ధాంతాలు అలంకారశాస్త్రంలో చాలా విలువైనవిగా పేరొందాయి. ఆయన రాసిన పలు గ్రంథాలు:
భామినీ విలాసం: ఆయన లక్షణ గ్రంథాలతో పాటుగా కొన్ని కావ్యాలు రచించారు. ఆ లక్షణ గ్రంథాలు కానివాటిలో ప్రసిద్ధి చెందిన కావ్యం భామినీ విలాసము. ఇది చాటుకవితల సంకలనం. వేర్వేరు సందర్భాల్లో చెప్పిన చక్కని చాటుకవితలను సంకలనం చేశారు. ఐతే ఈ గ్రంథం ఆయన లక్షణానికి లక్ష్యంగా రాశారనీ అంటారు