పాల్కురికి సోమనాధుడు 12-13 శతాబ్ధాల మధ్యకాలంలోని(కాకతీయుల కాలం) వాడు. వరంగల్ జిల్లాలోని పాల్కురి గ్రామం జన్మస్ధలం. తల్లి దండ్రులు శ్రీయాదేవి, విష్ణురామి దేవుడు. సోమన్న రచనలన్నీ అచ్చతెలుగులో సరళంగా ఉండి పామరులకు కూడా అర్థమవుతాయి.సోమనాధుని రచనలన్నీ శతకం, గద్య మొదలైన ఉదాహరణలతో సాహిత్య ప్రక్రియలు చేపట్టాడు.
ప్రముఖ రచనలు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర. అనుభవసారం, వృషధీప శతకం, చతుర్వేదసారం, సోమన పదకృతులు, రుద్రభాష్యం, సోమనాధ భాష్యం, బసవ రగడ, సద్గురు రగడ బసవలింగ నామావళి మొదలగునవి రచించాడు.