నల్లగొండ జిల్లా పిల్లలమర్రి గ్రామానికి చెందిన పినవీరభద్రుడు 1450 ప్రాంతానికి చెందినవాడు. "వాణి నా రాణి" అని సగర్వంగా చాటినవాడు.
30 ఏళ్ళు వచ్చేసరికి అతడు అనేక గ్రంధాలు రచించాడు. "నారదీయ పురాణం"ను తెలుగులో రచించాడు. కాళిదాసు శాకుంతలన్ని "శృంగార శాకుంతలం"గా తెలుగులో చెప్పాడు.
సాళువ నరసింహ రాయల ఆస్థాన కవిగా ఉంటూ ఆయన కోరడంతో "జైమినీ భారతం"ను తెలుగులోకి అనువదించాడు. ఇతను రచించిన జైమినీ భారతంలో ఒక చోట "చిరుబంతి పసుపు"
అనే సమాసం వాడాడు. దీన్ని శ్రీనాధుడు ఎంతో ఇష్టపడ్డాడు.