బమ్మెర పోతన 15వ శతాబ్ధంలో వరంగల్ జిల్లాలో బమ్మెర అనే గ్రామంలో లక్కమాంబ, కేశన దంపతులకు జన్మించాడు. వ్యవసాయం చేసేవాడు. ప్రధమ రచన భోగినీ దండకం. సింగభూపాలుడు అనే రాజుకు అంకితం చేశాడు. తరువాత తన రచనలన్నీ భగవతర్పణం గావించాడు. బమ్మెర పోతన
పోతన కవి, కవిసార్వభౌముడైన శ్రీనాధుని బంధువని అంటారు. శ్రీరాముని ఆనతి మేరకు సంస్కృతంలో వ్యాసుడు రచించిన భాగవతాన్ని ''ఆంధ్రమహాభాగవతము'' అనే పేరున తెనిగించాడు. పోతన ఇతర రచనలు వీరభద్ర విజయము, నారాయణ శతకం మొదలగునవి. ఆంధ్రసాహిత్యంలో పోతనామాత్యుడు చిరంజీవి