తిక్కన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయంలో ఒకడు. క్రీ.శ. 1205 నుండి 1288 వరకు జీవించాడు. తిక్కన నన్నయ మొదలుపెట్టి మధ్యలో ఆపివేసిన మహాభారతంలోని అరణ్యపర్యమును వదలి మిగతా 15 పర్యాలు రచించాడు. జన్మస్ధలం గుంటూరు (గుంటూరు జిల్లా). కాకతీయుల కాలం నాటివాడు.
అప్సటి నెల్లూరు రాజు మనుమసిద్ధి దగ్గర ముఖ్యమంత్రిగా చేశాడు. దాయాదుల వలన రాజ్యం కోల్పోయిన మనుమ సిద్ధికి, కాకతీయ మహారాజు గణపతిదేవుని సహాయంతో తిరిగి రాజ్యాన్ని కట్టబెట్టాడు. కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు కలవు. యజ్ఞం చేయుటవలన సోమయాజి అయ్యాడు (తిక్కన సోమయాజి)