Abhijit Vinayak Benergy

Abhijit Vinayak Benergy....భారతీయ సంతతికి చెందిన అభిజిత్ వినాయక్ బెనర్జీ ఆర్థికవేత్తకు నోబెల్ బహుమతి.. ఈయన జన్మస్థలం బొంబాయి.
ప్రస్తుతం మసాచూషెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎకనమిక్స్‌లో 'ఫోర్డ్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ప్రొఫెసర్'గా పనిచేస్తున్నారు.
ఈ బహుమతి అభిజిత్ తో పాటు ఎస్తేర్ డఫ్లో, మైఖేల్ క్రెమెర్‌లతో కలిపి ఈ బహుమతి ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా పేదరిక నిర్మూలన కోసం వారు చేసిన కృషికి గాను ఈ బహుమతి ప్రకటించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది చేసింది.
బహుమతి మొత్తం 90 లక్షల స్వీడిష్ క్రోనాల(సుమారు రూ.6.5 కోట్లు)ను వీరు ముగ్గురికి కలిపి అందజేస్తారు.
  ప్రపంచంలో పేదరికాన్ని తగ్గించేందుకు గత ఇరవయ్యేళ్లలో జరిగిన కృషిలో వీరు ముగ్గురు కీలక పాత్ర పోషించారని కమిటీ తెలిపింది.
ముంబయిలో 1961లో జన్మించిన అభిజిత్ వినాయక్ బెనర్జీ కలకత్తా విశ్వవిద్యాలయం, జేఎన్‌యూ, హార్వర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల్లో విద్యాభ్యాసం చేశారు.
.