Vaccine for Caronavirus…కరోనా వైరస్ కు వేక్సిన్ ఎపుడు వస్తుంది...

Vaccine for Caronavirus…కరోనా వైరస్ కు వేక్సిన్ ఎపుడు వస్తుంది...
బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీవారు ‘ఆస్ట్రజెనికా’ అనే కంపెనీవారితో కలసి తయారు చేస్తున్న వేక్సిన్ ముందువరుసులో ఉందని వార్తలు వస్తున్నాయి.
చైనా కంపెనీ ప్రకటనలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. తొలిదశ, తరువాత దశ ఫలితాలు విజయవంతమైనాయాని, మిలటరీ సైనికులమీద చేసిన ప్రయోగాలు విజయవంతమైనాయని తెలిపింది.
ఈ లోగా రష్యాకంపెనీ అనూహ్యంగా ముందుకు వచ్చింది. రష్యా వార్తా సంస్థ తమదేశలో పూర్తిస్ధాయి వేక్సిన్ తయారైనట్లు తెలిపింది. ఆగస్టు 12వ తేదీన తమ వేక్సిన్ విడుదలైతున్నట్లు చెబుతున్నారు. తమ వేక్సిన్ కు పూర్తిస్థాయి అనుమతులున్నట్లు చెబుతున్నారు. ఈ సంగతి రష్యా ఉపప్రధాని కూడా తెలిపారు. కానీ మొదటిదశ, రెండవ దశ ప్రయోగాలు మాత్రమే పూర్తై ఫలితాలు వచ్చాయి. కీలకమైన మూడవదశ ప్రయోగాలు జరిగి ఫలితాలు వచ్చిన తరువాత గానీ వేక్సిన్ అందుబాటులోకి వస్తుందని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు.
ఇక అమెరికా సంస్థ మోడరనావారి ప్రయోగాలు తుదిదశలో ఉన్నాయని, వేక్సిన్ నవంబర్ లో అందుబాటులోకి వస్తుందని ట్రంప్ ప్రకటించారు.
కానీ ఈ కంపెనీల మీద శాస్త్రజ్ఞుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం వేక్సిన్ ను మూడు దశలలో పరీక్షిస్తారని చెబుతున్నారు. మొదటి దశలో కేవలం పదుల సంఖ్యలో మనుషులమీద ప్రయోగాల చేస్తారని, రెండవదశలో కొన్ని వందలమందిమీద ప్రయోగాలు చేస్తారని ఈ రెండుదశలు కేవల సేఫ్టీకి సంబంధించినవని చెబుతున్నారు. మూడవ దశ ప్రధానమైనదని, కొన్ని వేలమంది మీద ప్రయోగాలు జరిపి, ఫలితాల మీద అధ్యయనం జరిపి అప్పుడు మాత్రమే వేక్సిన్ ను విడుదచేయాలని చెబుతున్నారు.
WHO వారి వివరాల ప్రకారం చివరిదశ ప్రయోగాలలో ఉన్న ఆరు వేక్సిన్ కంపెనీలు, ఆక్స్ ఫర్డ్ వారి ఆస్ట్రాన్కా మొదటిది. చెనా కంపెనీ సినోవిక్, చైనా కంపెనీ వారిదే వుహాన్ సంస్థవారిది ఒకటి,, చైనావారిదే మరొకటి బీజింగ్ సంస్థవారిది, అమెరికా కంపెనీ మోడర్నావారిది మరొకటి. జర్మన్ కంపెనిబయోన్ టెక్-పైజర్ ఒకటి. ఈ ఆరు కంపెనీల వేక్సిన్లు చివరిదశలో ఉన్నట్లు తెలుస్తుంది.
భారతదేశ కంపెనీ భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తున్న వేక్సిన్ ఆగస్టు 15 నాటికి వస్తుందని తెలిపారు కానీ, దీనిమీద కూడా సందేహాలున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
మొత్తం మీద అక్టోబర్ లో కానీ ఈ సంవత్సరం చివరిలో వేక్సిన్ విడుదలకు సంభందించిన శుభవార్త వినవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.