River Brahmaputra Pushkaralu…బ్రహ్మపుత్రా నది పుష్కరాలు

River Brahmaputra Pushkaralu…బ్రహ్మపుత్రా నది పుష్కరాలు గురు గ్రహం ఏడాదికోసారి ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు నిర్వహిస్తుంటారు. ఈనెల 5వ తేదీ నుంచి బృహస్పతి ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో బ్రహ్మపుత్ర నదికి పుష్కరాలు మొదలు కానున్నాయి. నాటి నుంచి 12 రోజుల పాటు పుణ్యస్నానాలు ఆచరిస్తారు
పుష్కర స్నానం చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని భారతీయుల నమ్మకం.
పుష్కరాల సందర్భంగా అసోంలో బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతం పుణ్యస్నానాలకు వచ్చిన యాత్రికులతో నిండిపోతుంది. గువాహటిలో స్నానాల కోసం కొత్తగా ఘాట్లు ఏర్పాటు చేయబడ్డాయి. పుష్కరాలకు అసోం వచ్చే ఇక్కడి పర్యాటక కేంద్రాలను చూదవచ్చు.
అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన కామాఖ్య గువాహటి నగరంలోనే ఉంది. దీనితో పాటు ఉమానంద ఆలయం, ఉగ్రతారా దేవాలయం, నవగ్రహ గుడి.. చూడవచ్చు
అసోం స్టేట్ మ్యూజియం, నెహ్రూ పార్క్ పిల్లలను అలరిస్తాయి. నదిలో క్రూజ్ విహారం సంతోషంగా ఉంటుంది. బ్రహ్మపుత్ర నదిలో ఏర్పడిన భారీ ద్వీపం మజూలీ.. పర్యాటకానికి స్వర్గ ధామం. కళలకు కాణాచి ఈ ద్వీపం. ఇక్కడి కళాకారులు పౌరాణిక ఘట్టాలను మనసుకు హత్తుకునేట్లు ప్రదర్శిస్తారు. గువాహటి నుంచి 350 కి.మీ దూరంలో ఉంటుందీ దీవి
పుష్కర స్నానానికి వచ్చే యాత్రికుల కోసం అసోం పర్యాటక శాఖ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రత్యేక బస్సుల్లో పుష్కర ఘాట్ కు వెళ్లడంతో పాటు తొమ్మిది పర్యాటక కేంద్రాలను తిప్పి చూపుతున్నారు. టికెట్ రుసుం చెల్లించాలి.
ఎలా వెళ్లాలి...? విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి గువాహటికి రైళ్లున్నాయి. హైదరాబాద్ నుంచి విమాన సర్వీసు కలదు.