header

Akakara Kaya / ఆకాకరకాయ
వర్షాకాలంలో మాత్రమే కనిపించే అరుదైన కూరగాయ ఆకాకరకాయ. ఆ రుచి తెలిసినవాళ్లు మాత్రం దాన్ని వదలకుండా తింటుంటారు. వీటిల్లో పోషకాలతోబాటు ఔషధ గుణాలూ బోలెడు.
వంద గ్రా. ఆకాకర కాయల నుంచి కేవలం 17 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. కానీ ఇందులో పీచూ ఖనిజాలూ విటమిన్లూ యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి.
గర్భిణులకి ఇది మంచి ఆహారం. అదీ నరాల సమస్యలు ఉన్నవాళ్లకి మరీ మంచిది. ఇందులో ఉండే ఫోలేట్లు పిండం పెరుగుదలకు ఎంతో దోహదపడతాయి.
పాలిపెప్టైడ్‌-పి అనే ఫైటో న్యూట్రియంట్‌ ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్‌ను క్రమబద్ధీకరించి రక్తంలో చక్కెరశాతం పెరగకుండా చేస్తుంది. ఇంకా కాలేయ, కండరాల సమస్యల్నీ ఇది నియంత్రిస్తుంది.
ఇందులోని సి-విటమిన్‌ శరీరంలోని టాక్సిన్లను హరించడం ద్వారా క్యాన్సర్లనూ అడ్డుకుంటుంది.
అన్నింటికన్నా ఇందులో ఉండే కంటోలా అనే ఫ్లేవొనాయిడ్‌, వయసుమీదపడకుండా చర్మం కాంతిమంతంగా ఉండేలా చేస్తుంది.
ఆకాకరలో విటమిన్‌-ఎ శాతమూ ఎక్కువే. అందుకే ఇది కంటిచూపుకీ మేలే. వైరస్‌లూ బ్యాక్టీరియాల కారణంగా తలెత్తే దగ్గూ జలుబులకి ఇది మందులా పనిచేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడేవాళ్లకీ ఇవి మంచివే.
సుమారు రెండు టీస్పూన్ల పొడిని ఓ గ్లాసు పాలు లేదా నీళ్లలో కలిపి తాగితే ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. అజీర్తి, మలబద్ధకంతో బాధపడేవాళ్లు వీటిని తరచూ తినడంవల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.