header

Alu….ఆలుగడ్డలు

Alu….ఆలుగడ్డలు

ఆలుగడ్డలో అన్నంలో ఉండే కార్బో హైడ్రేట్స్, నిమ్మకాయలోని సీ విటమిన్‌, అరటి పండులో ఉన్న పొటాషియం, యాపిల్‌లోని పీచుపదార్థాలూ మరెన్నో పోషకాలు ఉంటాయి. ఇది గ్లుటెన్‌ ఫ్రీ. ఆరోగ్యానికి ఈ దుంప చేసే మేలు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. దీన్లో ఉండే కెరోటినాయిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రకరకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్‌ సీ, బీ కాంప్లెక్స్‌, ఖనిజలవణాలూ ఆలూలో పుష్కలంగా ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు రాకుండానూ ఇది నివారిస్తుంది. రక్తపోటుని అదుపులో ఉంచడంతోపాటు, నిద్రలేమి సమస్యల్నీ దూరం చేస్తుంది. అల్సర్లకూ అరుగుదలకూ కంటి ఆరోగ్యానికీ బంగాళాదుంప మంచి మందు. ఇది మెదడుని చురుకుగా కూడా ఉంచుతుంది.
ఆలుగడ్డల్ని ఉడికించి చేసిన వంటకాలే ఆరోగ్యానికి మంచివి. మితంగా తినాలి అతిగా తినకూడదు. ఆలూ చిప్స్ కూడా ఎప్పుడైనా పరవాలేదు కాని అతిగా తినకూడదు