అరటితో భారతీయులకు పూర్వకాలంనుండి అవినాభవ సంబంధం ఉంది. ప్రతి శుభకార్యంలోనూ అరటిచెట్లు, అరటికాయల వాడకం తప్పనిసరి. అలాగే కూర అరటితో పాటు అరటిపువ్వు కూర కూడా ప్రసిద్ధి చెందినది. కానీ ప్రస్తుతం అరటిపువ్వుల వాడకం తక్కువగా ఉంది. ఇందుకు కారణం సరైన అవగాహన లేకపోవటం మాత్రమే. పోషకాలలో, రుచిలో ఇతర కూరగాయలకు తీసిపోదు.
అరటిపువ్వులో ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు ఎక్కువ. ఇన్సులిన్ సెన్సిటివిని పెంచుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. కనుక డయాబెటిక్ వారికి మంచి ఆహారంగా చెప్పవచ్చు. అరటిపువ్వులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాంటీ డిప్రసెంట్ గా పనిచేస్తుంది.
అరటిపువ్వలో గుండెను పరిరక్షించే గుణాలు అనేకం ఉంటాయి. రక్తపోటును తగ్గిస్తుంది. వేడి ఆవిరులు, రాత్రివేళ స్వేదం, నిద్రలేమి, గర్భసంబంధిత సమస్యల నివారణలో బాగా సహాయపడుతుంది. స్త్రీలలో సంతానోత్పత్తికి, సహాయకారి. ఋతుక్రమాన్ని సాధారణ స్థాయికి తీసుకురాగలదు.
అరటిపువ్వుతో కూరలు, వేపుడు, పకోడీలు, సూప్స్ చేసుకోవచ్చు. ఈ కూరలను అన్నం లేక చపాతీలు, పుల్కాలతో పాటు తినవచ్చు.
దీనిని గురించి తెలుసుకున్నవారు మీ మిత్రులకు, బంధువులకు, డయాబెటిక్ పేషంట్లకు తెలిపి అరటిపువ్వుల వాడకాన్ని ప్రోత్సహించండి. తద్వారా మన అరటి రైతులకు కూడా లాభం కలుగుతుంది.