header

ASH GOURD / బూడిద గుమ్మడి...

ASH GOURD / బూడిద గుమ్మడి...
బూడిద గుమ్మడి పోషకాల గని. ఇందులో 96 శాతం నీరే ఉంటుంది. కానీ మిగిలిన ఆ నాలుగుశాతంలోనే ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు లెక్కలేనన్ని. అందుకే దీన్ని మన ఆయుర్వేద వైద్యులే కాదు, చైనా సంప్రదాయ వైద్యంలోనూ వాడతారు. ఇందులో పుష్కలంగా ఉండే ఖనిజాల కారణంగా ఇది బీపీని అడ్డుకుంటుంది. మూత్రపిండ సమస్యలకు మందులా పనిచేస్తుంది. అల్సర్లూ, హృద్రోగాలూ మధుమేహం వంటి ఎన్నో వ్యాధుల్ని నివారిస్తుందని ఆయుర్వేదం పేర్కొంటోంది. వాత, పిత్త, కఫ దోషాలను హరించే లక్షణం కారణంగా దగ్గూజలుబుల్నీ ఆస్తమానీ కూడా తగ్గిస్తుందట. విటమిన్-సి ఎక్కువగా ఉండటంతో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.
అనీమియాతో బాధపడేవాళ్లకీ ఇది ఎంతో మంచిదట.
వేసవిలో దీని గుజ్జుతో షర్బత్లాంటివి చేసుకుని తాగడంవల్ల దాహం తగ్గుతుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది.
రోజూ దీన్ని ఆహారంలో భాగంగా చేసుకునేవాళ్లలో నిద్రలేమి కూడా ఉండదట.
తలనొప్పి, మైగ్రెయిన్ వంటి సమస్యలను నివారించే విటమిన్ బి2 కూడా బూడిదగుమ్మడిలో దొరుకుతుంది.
కెరటోకోనస్, కాటరాక్ట్స్, గ్లకోమా... వంటి అనేక కంటి సమస్యలకు విటమిన్ బి2(రిబోఫ్లేవిన్) లోపమే కారణం అని అనేక అధ్యయనాల్లో తేలింది. కాబట్టి బూడిదగుమ్మడిని ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆ లోపం తగ్గుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ బి2 జీర్ణక్రియకీ నాడీవ్యవస్థ పనితీరుకీ హార్మోన్ల క్రియాశీలతకీ ఎంతో తోడ్పడుతుంది.