header

Beetroot

బీట్ రూట్ – మంచి ఆరోగ్యం
బీట్ రూట్ లో ఇన్ ఆర్గానిక్ నైట్రేట్ ఉండటం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అన్ని కూరగాయలలో కంటే బీట్ రూట్ లో చక్కెరశాతం ఎక్కువగా ఉంటుంది. బీట్ రూట్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రక్తప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. నరాలకు స్వాంతన చేకూరుతుంది.. మూత్రపిండాలు, కాలేయం మరియు గాల్ బ్లాడర్ లు చక్కగా పనిచేస్తాయి. ప్రేగులను శుద్ధి చేస్తుంది. స్త్రీలలో వచ్చే బహిష్టు సమస్యలు తగ్గుతాయి. రక్తహీనత తగ్గుతుంది. బీట్ రూట్ తో పూర్తి ప్రయోజనాలు పొందాలంటే వీటిని పచ్చిగానే తినటం మంచిది. బీట్ రూట్ రసం తాగటం వలన అధిక రక్తపోటు అదులోకి వస్తుందని అధ్యయనాలలో తేలింది. వ్యాయామాలు చేసేముందు బీట్రూట్ రసం తాగటం వలన వ్యాయామాలు చేయటాని అధిక శక్తి వస్తుంది. బీట్ రూట్ లో ఉన్న ఫైటో పోషకాలు క్యాన్సర్ తో పోరాడుతాయి. బీట్ రూట్ రసంను నేరుగా తాగకూడదు. ఈ రసం చిక్కగా ఉండటం వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇతర పండ్ల రసాలలో కలుపుకొని తాగాలి లేక యాపిల్ , బీట్ రూట్ లను కలిపి జ్యూస్ తయారు చేసుకోవాలి. మన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచే విటమిన్ సి, పీచు, పొటాషియం, మాంగనీసు వంటివి బీట్ రూట్ లో పుష్కలంగా ఉంటాయి.బీట్ రూట్ రసంలో ఉన్న బెటలైన్ మన శరీరంలోని వ్వర్థాలను బయటకు పంపివేస్తుంది.