header

Bottle Gourd

సొరకాయ
సొరకాయ ను దూధి లేదా లాకి అని కూడా అంటారు. విభిన్న ఆకారాలలో, సైజులలో ఉంటాయి. గుండ్రంగా ఆకుపచ్చగా కొన్నికాయలు ఉంటే, లేతాకు పచ్చరంగులో పొడవుగా కొన్ని ఉంటాయి. తక్కువ క్యాలరీలతో, పీచు ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, బి కాంప్లెక్స్లు, క్యాలియం, ఐరన్, సోడియం,పొటాషియం వంటి ఖనిజాలు, బయోఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. వందగ్రాముల పొట్లకాయలో 12 క్యాలరీలు మాత్రమే ఉంటాయి.
ప్రయోజనాలు
క్రమం తప్పకుండా సొరకాయ రసం తాగుతుంటే బరువు తగ్గుతారు. నరాలకు సొరకాయ రసం టానిక్ లాంటిది. నాడీవ్యవస్థపై చల్లని ప్రభావం చూపుతుంది. దీనిలోని అత్యంత పీచు పదార్థం లో-ఫ్యాట్ కొలెస్టరాల్ను తగ్గిస్తుంది. సొరకాయ జీర్ణవ్యవస్థకు అద్భుతమైన కూరగాయ.ఎసిడిటి కడుపుబ్బరం, అజీర్ణం చికిత్సలో సహకరిస్తుంది. అధికపీచు మలబద్ధకాన్ని నివారిస్తుంది. సొరకాయ తినటం వలన దీనిలోని నీటిశాతం కడుపు నిండుగా ఉన్న భావాన్ని కలిగించి ఆకలిని తగ్గిస్తుంది.దీనివలన బరువు తగ్గవచ్చు. మూత్రసంబంధిత లోపాలను సరిచేయగలదు. తాజా సొరకాయ రసాన్ని ఒక టీస్పూన్ నిమ్మరసంతో కలిప్ తాగితే అధిక యాసిడ్ లెవెల్స్ వల్ల మూత్రంలో కలిగే మంటనుంచి ఉపశయనాన్ని ఇస్తుంది. నిద్రలేమికి సొరకాయ మంచి చికిత్స సొరకాయ రసాన్ని రోజూ త్రాగడం వలన చర్మం ఆరోగ్యంగా మచ్చలు లేకుండా నిగారిస్తుంది. సొరకాయను పచ్చిగా, రసం రూపంలోగాని, ఉడికించి గాని ఎలా అయినా తీసుకోవచ్చు రసం తీసేముందు కొద్దిగా తిని చూడాలి. చేదుగా ఉంటే పారవేయాలి. జ్యూస్ లలో కలపరాదు. రసం తాగాక ఉదరంలో నొప్పి వికారం, వాంతులు ఉంటే వైద్యుని సంప్రదించాలి.
మంచి కాయలను ఎన్నుకోవటం కాయపైనూగు ఉండి లేతపచ్చగా ఉంటే లేతగా ఉన్నట్లు, గోరుతో నొక్కితే తెలుస్తుంది.