వంకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంకాయలో పీచు, పిండి పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్ధాయిలను అదుపులో ఉంచుతుంది. దీనిలో లభించే పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. ఫైటోన్యూట్రియంట్లు కొలస్ర్టాల్ ను తగ్గించటానికి, రక్తప్రసరణ సాఫీగా జరగటానికి తోడ్పడతాయి. వంకాయలో ఫోలేట్, మెగ్నీషియం, పాటాషియం, విటమిన్ బి3, బి 6, యాంటీ ఆక్సిడెంట్లు, బీటాకెరటోన్లు అధికంగా లభిస్తాయి. ఇవి ఒత్తిడిని దూరం చేసి, చురుకైన జ్గ్నాపక శక్తిని అందిస్తాయి. వంకాయలో నీటిశాతం, కెలరీలు ఎక్కువ. త్వరగా కరిగే పీచు ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం.