header

Cabbage

క్యాబేజీ
క్యాబేజీ క్యాన్సర్ ను ఎదుర్కొనటంలో సహాయపడుతుంది. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమయ్యే ప్లేవనాయిడ్స్ సమృద్ధిగా అందుతాయి అందువలన పాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా క్యాబేజీని తింటే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చని సూచిస్తున్నారు. పిల్లలకు పాలిచ్చే తల్లలు క్యాబేజీ తింటే పాలు బాగా పడతాయంటారు.
క్యాబేజీలో పోషకాలు ఎక్కువన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందులోని సల్పోరాఫెన్ క్యాన్సర్ వ్యాధులను అడ్డుకుంటుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఇంకా ఇందులోని 3-3 డై ఇండోలిల్ మిధేన్ (డిఐయం) రేడియేషన్ ధెరపీ కారణంగా తలెత్తే దుష్పలితాలనూ నివారిస్తుందని జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు ఎలుకలను రేడియేషన్ కు గురిచేసి వాటిలో కొన్నింటికి డి యం ను ఇచ్చారట. మరికొన్నింటికి ఇవ్వలేదట నెలరోజుల తరువాత చూసే డి ఎం ఇచ్చిన ఎలుకలు రేడియేషన్ ను తట్టుకుని జీవించాయని తేలింది. రొమ్ముక్యాన్సర్ కారంణంగా తలెత్తే కంతుల పరిమాణం పెరగకుండా క్యాబేజీలోని ఎపిజెనిన్ అనే రసాయనం అడ్డుకుంటుందని యూనివర్శిటీ ఆఫ్ మిస్సోరికి చెందిన తాజా పరిశోధనలలో తేలింది.
క్యాబేజీలో అధికంగా ఉండే బీటాకెరటోన్, ట్యూటెన్, జియాక్యాంధిన్, క్యాంఫెరాల్, క్యుయెర్పిటిన్.... వంటి అంధోసైనిన్ లు యాంటీ ఆక్సిడెంట్లు, గుండెరోగాలను కంటికండరాల బలహీనతలను క్యాటరాక్ట్ ను 35 శాతం నిరోధిస్తాయి. రోజూ అరకప్పు ఉడికించి క్యాబేజీని తింటే శరీరానికి అవసరమయ్యే విటమిన్ సిలో 35శాతం లభిస్తుంది. అలాగా 81.5 మై.గ్రాముల కె విటమిన్ కూడా లభిస్తుంది.
విటమిన్ కె ఎక్కువగా ఉండే వంకాయరంగు, ఎరుపురంగుల క్యాబేజీ ఆల్జీమర్స్ వచ్చే ప్రమాదాన్ని అడ్డుకుంటుంది. క్యాబేజీలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎముక సాంద్రతని పెంచి అస్టియోపొరోసిస్ నీ నివారిస్తాయి.