కాలీఫ్లవర్ లో పీచూ, నీటిశాతం అధికంగా ఉండటంతో జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులోని రసాయనాలు పొట్టలో హానికారక బ్యాక్టీరియా పెరగకుండా అరికడతాయి. నాడీసంబంధ వ్యాధులు రాకుండానూ కాపాడతాయి. కాలీఫ్లవర్ లోని పీచు కారణంగా హృద్రోగాలు, పక్షవాతం, బి.పీ, మధుమేహం, ఊబకాయం, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయని యూనివర్శిటీ ఆఫ్ కెంటకీ పరిశోధనలలో తేలింది.
కాలీఫ్లవర్ లోని కోలిన్ నిద్రపట్టడానికి జ్ఙాపక శక్తికి కూడా తోడ్పడుతుంది.
తాజా కాలీఫ్లవర్ లో విటమిన్ సి శాతం ఎక్కువగా ఉంటుంది. దీనితో రోగనిరోధకశక్తి బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సి విటమిన్ కంటి కండరాలు క్షీణించకుండా కాపాడుతుంది.
అందుకే విటమిన్ సి ఎక్కువగా ఉన్న పదో ఆహారపదార్ధంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ దీన్ని పేర్కొంది.
కాలీఫ్లవర్లోని సల్ఫోరా ఫేన్ రెటీనా కణజాలాన్ని రక్షిస్తుంది.
కాలీఫ్లవర్ లో ఉండే ఫైటో కెమికల్స్ క్యాన్సర్లను నివారిస్తుందని తేలింది. రక్తనాళాలలో కొవ్వు కణాలు పేరుకోకుండా కాపాడుతుంది.
ప్రస్తుతం మన ప్రాంతాలలో తెల్ల రంగు కాలీఫ్లవర్ లు దొరుకుతున్నాయి. కానీ వీటిలో ఊదా, నారింజ, ఆకుపచ్చ రంగులలో కూడా వస్తున్నాయి.
కాలీఫ్లవర్ ను ఎక్కువగా ఉడికించరాదు. 5 నిమిషాలపాటు ఉడికించిన కాలీఫ్లవర్ ను సలాడ్లగా తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునా వారు అన్నం, దుంపలు తగ్గించుకుని కాలీఫ్లవర్ కూరలు తినవచ్చు. దొరికితే అన్నిరంగుల కాలీఫ్లవర్ లను తినటం మంచిది.