క్యారెట్లు అద్భుత పోషకాలు. మిగిలిన ఏ పండు లేక కూరగాయలలో లేని కెరోటిన్ క్యారెట్ లలోనే ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది. క్యారెట్లు ఎక్కువగా తినటంవలన కంటిచూపు మెరుగుపడుతుంది. ఏ విటమిన్ లోపమే రేచీకటి. క్యారెట్ లలో బి.సి విటమిన్ లతో పాటు కొలస్ట్రాల్ ను తగ్గించే క్యాల్షియం పెక్లేట్ ఉంటుంది. పచ్చిక్యారెట్ లలో విటమిన్ ఎ, పొటాషియం, విటమిన్ సి, బి6, థైమీన్, పోటాషియం, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియంలు ఉంటాయి. డయోరియాకు క్యారెట్ సిరప్ మంచి మెడిసిన్. ఇది బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. వాంతులు అవకుండా చేస్తుంది. నులిపురుగుల నివారణకు క్యారెట్ మంచిది. పిల్లలకు ఓ కప్పు తురిమిన క్యారెట్ ను పరగడుపున తినిపించి ఇంకేమీ పెట్టకుండా ఉంటే పొట్ట శుభ్రమవుతుంది. బీ.పి ని తగ్గిస్తాయి. ముఖ్యంగా కంటిచూపును మెరుగుపరుస్తాయి. కెరోటిన్ కు మరోరూపం లైకోపిన్ ఎరుపురంగు క్యారెట్లలో ఎక్కువ. కంటి కండరాల క్షీణతను తగ్గించడంతో పాటు హృద్రోగాలను అరికట్టటంలో బాగా పనిచేస్తుంది.