header

Chamadumpalu / చామ దుంప

Chamadumpalu / చామ దుంప
ఆసియా దేశాల్లోనే పుట్టిన చామ దుంప ప్రస్తుతం ప్రపంచమంతటా విస్తరించి ఉంది. భారతదేశంలో పెద్ద ఎత్తునే చామను సాగు చేస్తున్నారు. చామ మొక్కకు కాండం అంటూ ఉండదు. చిత్తడి నేలల్లో, కాలువల వెంట చామ ఎక్కువగా పండుతుంది. గుత్తులు గుత్తులుగా చామ దుంపలు పెరుగుతాయి. చామను నేరుగా తింటే నోరు పాడవుతుంది. ఉడకబెట్టి, పులుసుగా, కూరగా వండి చామను వాడుతూంటారు.
పోషకాలు:
చామ దుంపలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. విటమిన్‌ సి, బి6, ఇ ఎక్కువగా లభించే విటమిన్లు. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్‌ లాంటి ఖనిజ లవణాలు చామ దుంపల్లో లభిస్తున్నాయి.
ఆరోగ్య లాభాలు:
క్రీడాకారులకు తక్షణం శక్తినిచ్చే ఆహారంగా చామదుంపను చెప్పుకోవచ్చు. తక్కువ క్యాలరీ ఆహారం అవ్వడం వల్ల చామ దుంపలను బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అజీర్తి, హైపర్‌ టెన్షన్, కండరాలు బలహీనతకు ఇది మంచి ఔషధంగా పని చేస్తుంది.