భారత దేశంలోని గోరుచిక్కుడు విరివిగా పండుతుంది, వాడకం కూడా ఎక్కువే. దీనినే గోకరకాయ అని కూడా అంటారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ దీని సాగు జరుగుతోంది. అమెరికా, మెక్సికో, ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లోను గోరు చిక్కుడు పంట విస్తారంగానే పండుతోంది. కరువు పరిస్థితులను తట్టుకుని మరీ గోరు చిక్కుడు మొక్కలు పెరుగుతాయి. గోరుచిక్కుడును కూరలు తదితర వంటలతో పాటు, గోరుచిక్కుడు జిగురును వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసి రకరకాల ఆహార ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు.
గోరు చిక్కుడులో ప్రొటీన్లు, స్వల్పంగా పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్–ఎ, విటమిన్–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్–సి, విటమిన్–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఎముకలకు, కండరాలకు బలాన్నిస్తాయి. రక్తహీనతను నివారిస్తాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. స్థూలకాయాన్ని అరికడతాయి.