header

Drumsticst

మునగాకు / మునక్కాయలు
శరీరానికి కావలిసిన అన్ని రకాల ప్రొటీన్లూ, పీచూ మునగాకులోనూ, కాయల్లోనూ ఎక్కువగా ఉండటం వలన పోషక లేమితో బాధపడేవాళ్లకు ఎంతో మంచిది. వంద గ్రాముల తాజా మునగాకుల్లో నారింజలో కన్నా ఏడురెట్ల సి విటమిన్, క్యారెట్లలో కన్నా నాలుగు రెట్ల కాల్షియం , అరటిపండ్లలో కన్నా మూడు రెట్ల ఐరన్, బాదంలో కన్నా మూడురెట్ల విటమిన్-ఇ ఎక్కువగా ఉంటాయి.
మునగాకులో రోగ నిరోధక శక్తిని పెంచే 46 సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అందుకే క్యాన్సర్లు, కాలేయ వ్యాధులను, బ్యా క్టీరియల్, ఫంగల్ వ్యాధులను రాకుండా చేస్తుంది. అల్జీమర్స్, అల్సర్ల వంటి వాటిని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గించటంతో పాటు, గాయాలు త్వరగా తగ్గేందుకూ కారణమవుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.బీ.పినీ చక్కెర వ్యాధులను అదుపులో ఉంచుతాయి మునగాకు, మునక్కాయలు.
ఈ ఆకులలోని ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతకు ఇది మంచి మందు. చిన్నతనంలో వచ్చే కంటి వ్యాధులను రేచీకటినీ నివారించేందుకు మునగాకులోని బీటా కెరటిన్ అద్భుతంగా పనిచేస్తుందని ఇంటర్నేషనల్ ఐ ఫౌండేషన్ చెబుతుంది.
మునగాకులతో చేసే టీ అల్సర్లని, డయేరియాని నివారిస్తుంది. సంప్రదాయ చికిత్సలలో భాగంగా మునగాకులను కణతలకి రుద్దితే తలనొప్పి తగ్గతుంది. ఎక్కడైనా తెగి రక్తం కారుతుంటే మునగాకు నూరి పెడితే వెంటనే తగ్గుతుందని నిపుణులు చెబుతారు. మునక్కాయలను ఎక్కువగా తింటే కడుపులోని నులిపురుగులు చనిపోతాయి. కాలేయం, ప్లీహానికి సంబంధించిన వ్యాధులూ, కీళ్ల నొప్పులు తగ్గతాయి. ఈ కాయలలో ఎక్కువగా ఉండే ప్రొటీన్లు, పీచు కారణంగా పోషకాహార లోపం ఉండదు. డయేరియాను నివారిస్తాయి.
మునగ పూలతో కాచిన కషాయాన్ని తాగితే గర్భిణులకు పాలు బాగా పడతాయట. ఇది మూత్రవ్యాధుల నివారణకు దోహద పడుతుంది. ఎండిన గింజు లేదా వాటి పొడి సైతం నీళ్ళలోని మలినాలను అద్భుతంగా తొలగిస్తాయి.

100 గ్రాముల మునగాకులో ఉండే పోషకాలు
శక్తి 64 క్యాలరీలు
పిండి పదార్ధాలు 8.28 గ్రా
పీచు 2.0 గ్రా
కొవ్వులు 1.4 గ్రా
ప్రొటీన్లు 9.40 గ్రా.
విటమిన్ ఎ 378 మైక్రోగ్రాములు
క్యాల్షియం 185 మి.గ్రా
ఐరన్ 4 మి.గ్రా
మెగ్నీషియం 147 మి.గ్రా
మాంగనీస్ 0.36 మి.గ్రా
ఫాస్పరస్ 112 మి.గ్రా
పొటాషియం 337 మి.గ్రా
సోడియం 9 మి.గ్రా
జింక్ 0.6 మి.గ్రా
......... 100 గ్రాముల మునక్కాయలలో ఉండే పోషకాలు
శక్తి 37 క్యాలరీలు
పిండి పదార్ధాలు 8.53 గ్రా
పీచు 302 గ్రా
కొవ్వులు 0.2 గ్రా
ప్రొటీన్లు 2.10 గ్రా.
విటమిన్ ఎ 4 మైక్రోగ్రాములు
క్యాల్షియం 30 మి.గ్రా
ఐరన్ 0.36మి.గ్రా
మెగ్నీషియం 45 మి.గ్రా
మాంగనీస్ 0.259 మి.గ్రా
ఫాస్పరస్ 50 మి.గ్రా
పొటాషియం 461 మి.గ్రా
సోడియం 4.2 మి.గ్రా
జింక్ 0.45 మి.గ్రా