header

Ladies Fingers

బెండకాయలు
బెండకాయలలో పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రొటీన్లు, విటమిన్ సి, మెగ్నీషియం, విటమిన్ కె పిండి పదార్ధాలు ఉంటాయి.
బెండకాయలలో ఉండే లెక్టిన్ అనే ప్రొటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బెండకాయలలో ఉండే ఫోలేట్లు కూడా క్యాన్సర్ కణాలను అడ్డుకుంటాయి. ఈ ఫోలెట్లు గర్భణీ స్త్రీలకు ఎంతో ఉపయోగం.
బెండకాయ గింజలను ఎండబెట్టి చేసిన పొడిని మధుమేహానికి మందుగా కూడా వాడతారు. బెండకాయలలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు కొలస్ట్రాల్ ను తగ్గిస్తాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలుపుతుంది.
బెండకాయలలో పీచు పుష్కలంగా ఉంటుంది. బెండకాయ గింజలలో ఉన్న పదార్ధాలు యాంటీ ఆక్సిడెంట్లలాగా పనిచేసి ఒత్తిడిని తగ్గించగలవని పరిశోధనలలో తేలింది.
విటమిన్ కె ఎక్కువుగా ఉండే బెండకాయలు ఎముకలకూ ఎంతో మంచివి. క్యాల్షియంను శోషించుకునేందుకు వీటిలోని ఇ విటమిన్ తోడ్పడుతుంది.
జగ్రత్తలు :
మొలలూ, మూత్రపిండ వ్యాధులు, కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారు వీటిని తక్కువగా తీసుకోవటం మంచిది. వీటిల్లోని ఫ్రక్టేన్లూ, ఆక్సలేట్లూ, సొలనిన్లు బెండకాయలలో ఉండటం వలన వీరి బాధలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.