చామాకులు ఆరోగ్యానికి చాలా మంచివి. చామ దుంపలలో కంటే వీటి ఆకులలోనే ఎక్కువగా పోషకాలు లభిస్తాయి. తక్షణంశక్తి నిచ్చే ఆహారాలలో ఇవి కూడా ఒకటి. ప్రొటీన్లు, పీచు ఎక్కువగా ఉండటం వలన తరచుగా తింటే బరువు తగ్గుతారు. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది తద్వారా కంటిచూపు మెరుగు పడుతుంది. ఈ ఆకులు పెద్దవిగా ఉంటాయి. వేడినీళ్లలో ముంచి చామాకుల పొట్లాలు అనే ఆహారం తయారు చేసుకుంటారు.